![]() |
![]() |
.webp)
బుల్లితెర తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది బిగ్ బాస్. ఇక బిగ్ బాస్ సీజన్-6 ప్రేక్షకులకు ఎంతగానో వినోదాన్ని పంచిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ -6 లో అందరికి గుర్తుండిపోయేవాళ్ళు కొందరే ఉన్నారు. అందులో ఇనయా సుల్తానా ముజిబుర్ రహమాన్ ఒకరు. తన స్ట్రాటజీతో పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఇనయా.
బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. ఆ తర్వాత బిగ్ బాస్ లో అవకాశం లభించింది. షోలోకి వెళ్ళాక.. టాస్క్ లలో తను బాయ్స్ ని డిఫెండ్ చేసిన తీరుకి సోషల్ మీడీయాలో ట్రెండింగ్ లోకి వచ్చింది ఇనయా. అలా ఇనయా బిగ్ బాస్ షోలో ఉండి మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. అయితే ఇనయా సుల్తానా బిగ్ బాస్ షో తర్వాత బిజీ అయిపోయింది. సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ని పెట్టింది. అందులో కుకింగ్ వీడియోలని, ఇంకా షాపింగ్ , జర్నీ వీడియోలంటూ అప్లోడ్ చేస్తూ బిజీ అయిపోయింది. కాగా తన ఫోటోలని అప్లోడ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంది. రీసెంట్ గా ఒక కారు కూడా కొన్న ఇనయా.. గత వారం ఐకియా నుండి ఫర్నీచర్ ని ఆర్డర్ చేసి.. వాటి అన్ బాక్స్ చేసి చూపించింది. అయితే తన గురించి ప్రతీ విషయాన్ని అభిమానులకు తెలియాజేయాలనే ఉద్దేశంతో.. ప్రతీ అప్డేట్ ని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ వస్తోంది ఇనయా.
ఎప్పుడు ట్రెండీగా కన్పించే ఇనయా తాజాగా తన ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసింది. దానికి సంబంధించిన కొన్ని ఫొటోలని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. ఇనయా ఒక వీడియోని పోస్ట్ చేసింది. ఇందులో 1% పూజ చేస్తానని, మిగతా 99% పబ్బుల్లో డాన్స్ చేస్తానని ఇనయా చెప్పింది. 'I can do both ' అనే క్యాప్షన్ రాసి అప్లోడ్ చేసిన వీడియోని షేర్ చేసింది ఇనయ. దేవుడి ఫొటోలకి దండం పెడుతున్న ఫోటో ఒకవైపు, మరొకవైపు పబ్బుల్లో డ్యాన్స్ చేస్తున్న వీడియో.. రెండు కలిపి ఉన్న వీడియోని చూసి.. ఈ సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దామని అనుకుంటావంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు. ఎప్పుడు తన హాట్ ఫోటోలతో ట్రెండింగ్ క్రియేట్ చేసే ఇనయా ఇలా వరలక్ష్మి పూజ చేయడంతో అందరు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |